ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం
టంగుటూరు/ 29 మార్చ్(హిం.స) ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం సమీపంలో 16వ నంబర్‌ జాతీయ
accudent


accudent


accudent


accudent


accudent


accudent


accudent


accudent


accudent


accudent


accudent


accudent


accudent


accudent


accudent


accudent


accudent


accudent


accudent


accudent


టంగుటూరు/ 29 మార్చ్(హిం.స) ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం సమీపంలో 16వ నంబర్‌ జాతీయ రహదారిపై గురువారం అతివేగం, నిద్రమత్తు కారణంగా జరిగిన ప్రమాదం ముగ్గురు ప్రాణాలు తీసింది. మరో ముగ్గురిని ఆస్పత్రి పాలుచేసింది. నెల్లూరు జిల్లా కందుకూరులోని గుర్రంవారిపాలెంకు చెందిన రాయని స్రవంతికి తెలంగాణ రాష్ట్రం పాల్వంచలో బుధవారం రాత్రి వివాహమైంది.

ఈ శుభకార్యానికి స్రవంతి కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం ఉదయం వాహనాల్లో బయల్దేరి వెళ్లారు. వివాహం అనంతరం అర్ధరాత్రి 12 గంటల తర్వాత వారు తిరుగు ప్రయాణమయ్యారు. వధువు తల్లి అరుణ (50), సోదరుడు వేణు, చిన్నమ్మ కుమార్తె గుళ్లాపల్లి శ్రావణి (22), మేనమామ తల్లపనేని వినోద్‌, ఆయన భార్య దివ్య (28) వారి మూడేళ్ల కుమారుడు అభిరామ్‌ ఒక కారులో బయల్దేరారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం సమీపంలోని ఫ్లైఓవర్‌ దిగువన గురువారం ఉదయం వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెండో వైపు మార్గంలోకి వెళ్లి మార్జిన్‌లో ఉన్న సిమెంటు దిమ్మెను ఢీకొట్టింది.

దీంతో వెనుక సీట్లో కూర్చున్న అరుణ, శ్రావణి, దివ్య అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న వినోద్‌, ఆయన కుమారుడు అభిరామ్‌, ముందు సీట్లో కూర్చొన్న వేణుకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై నాగేశ్వరరావు, హైవే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు నుంచి మృతులను, క్షతగాత్రులను బయటకు తీశారు. గాయపడిన వారిని 108 వాహనంలో రిమ్స్‌కు పంపారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వీరిలో వినోద్‌, ఆయన కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. వెనుకనే వస్తున్న పెళ్లి బస్సులో ఉన్న వధూవరులు, బంధువులు, ఇతర వాహనాల్లో ఉన్న మరికొందరు ప్రమాద స్థలం వద్ద దిగి కన్నీరు మున్నీరయ్యారు. అతివేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.

హిందూస్తాన్ సమాచార, రాజీవ్


 rajesh pande