వాట్సాప్ నెంబర్ షేర్ చేసిన కేజ్రీవాల్ భార్య
ఢిల్లీ : 29మార్చ్ ( హింస) అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతు ఇవ్వాలంటూ ఆయన భార్య సునితా కేజ్రీవాల్ ఇవాళ కో
.....


ఢిల్లీ : 29మార్చ్ ( హింస) అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతు ఇవ్వాలంటూ ఆయన భార్య సునితా కేజ్రీవాల్ ఇవాళ కోరారు. ఈ నేపథ్యంలో ఓ వాట్సాప్ నెంబర్ను ఆమె షేర్ చేశారు. ఆమ్ ఆద్మీ నేతకు మెసేజ్లు చేయాలని ఆ నెంబర్ను ఆమె వెల్లడించారు. కేజ్రీవాల్ను ఆశీర్వదించాలని డ్రైవ్ చేపడుతున్నామని, 8297324624 వాట్సాప్ నెంబర్కు మీ దీవెనలు, ప్రార్థనలను మెసేజ్ చేయాలని, మీరు ఎటువంటి మెసేజ్ చేయాలనుకున్నా చేయవచ్చు అని సునితా కేజ్రీవాల్ తెలిపారు. గురువారం కూడా సునితా కేజ్రీవాల్ ఓ వీడియో మెసేజ్ను చేశారు. ఈడీ కస్టడీలో ఉన్న తన భర్త ఆరోగ్యం సరిగా లేదని ఆమె ఆ సందేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande