రాహుల్ గాంధీ పై కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: ఏప్రిల్ 27 (హిం.స) కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నా
రాహుల్ గాంధీ పై కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు


ముంబై: ఏప్రిల్ 27 (హిం.స)

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారనే ఉహాగానాల నేపథ్యంలో కేంద్ర మంత్రి, ముంబై నార్త్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి పీయూష్ గోయెల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ 4-5 చోట్ల పోటీ చేయవచ్చని అన్నారు. వయనాడ్, అమేథిలో ఆయనకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.ముంబై నార్త్ నుంచి పోటీ చేయాల్సిందిగా రాహుల్ను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఆయన పోటీ చేయాలనుకుంటే అమేథి నుంచి పోటీ చేయవచ్చు. తగినంత ధైర్యం ఉంటే వారణాసి (మోదీ నియోజకవర్గం) నుంచి కూడా పోటీ చేయవచ్చు. వయనాడ్లో ఆయన ఓడిపోతారు.

అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి తప్పదు. ఒక వేళ అయోధ్య వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు. కానీ అది వేరే విషయం. వాళ్లు శ్రీరాముడిని వ్యతిరేకించారు. రామసేతు ధ్వంసం చేసే ఆలోచన చేశారు. ఆయన (రాహుల్) అక్కడకు (అయోధ్యకు) వెళ్లి తమ పార్టీ నేతలు, కూటమి భాగస్వామి నేతలు ఏదైతే చెప్పారో దానికి క్షమాపణ కోరాల్సి ఉంటుంది అని పీయూష్ గోయెల్ శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని అమోథీ, రాయబరేలి నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఆ రెండు నియోజకవర్గాల నేతలతో కాంగ్రెస్ కీలక సమావేశం శనివారం ఢిల్లీలో జరుగుతున్న నేపథ్యంలో పీయూష్ గోయెల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వయనాడ్లో ఇప్పటికే రాహుల్ పోటీలో ఉండగా, అమేథీ నుంచి కూడా మూడోసారి బరిలోకి ఏదైనా ఉన్నట్టు సమాచారం.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande