రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఆస్కార్ నటుల కంటే ఎక్కువగా నటించారు.. కేటీఆర్ ఎద్దేవా
తెలంగాణ:మార్చి 29 (హిం.స)కొంతమంది నేతలు సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ ప్రజలను మోసం చేస్తున్నార
రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఆస్కార్ నటుల కంటే ఎక్కువగా నటించారు.. కేటీఆర్ ఎద్దేవా


తెలంగాణ:మార్చి 29 (హిం.స)కొంతమంది నేతలు సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కీలక నేతలు అంతా పార్టీ వీడి వెళ్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పట్నం మహేందర్రెడ్డిని మంత్రిగా చేస్తే అందరికీ సహకరిస్తారని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుకున్నామని చెప్పారు.

అయితే సునీత, మహేందర్రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచి తమ అభ్యర్థుల ఓటమికి కారకులయ్యారని మండిపడ్డారు. ఎంపీ రంజిత్రెడ్డి, మహేందర్రెడ్డి ''గత సమావేశంలో తనకంటే కాంగ్రెస్ను ఎక్కువగా తిట్టారన్నారు. వారిద్దరూ ఆస్కార్ నటుల కంటే ఎక్కువగా నటించారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఆ నేతలు అన్ని మంచి మాటలు చెప్పారని... ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన తర్వాత వీరు పార్టీ మారడానికి ప్లాన్ చేశారని మండిపడ్డారు. పార్టీ మారిన నేతలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పరిశ్రమలు తనవల్లే వచ్చాయని రంజిత్రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మహేందర్రెడ్డి, రంజిత్రెడ్డి మళ్లీ వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకొన్నా పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పారు.

తాము కష్టకాలంలో ఉన్నప్పుడు కేశవరావు, కడియం శ్రీహరి మెల్లగా పార్టీ నుంచి జారుకుంటున్నారని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్లో పదవులు అనుభవించి పార్టీ నుంచి పోయే నేతలు రెండు రాళ్లు తమపై వేసి పోతారని మండిపడ్డారు.పెద్దలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని.. కాలమే ఆ నేతలకు సమాధానం చెబుతుందని అన్నారు. జీవితం మొత్తం బీసీలకు సేవ చేసిన కాసాని జ్ఞానేశ్వర్ను చేవెళ్లలో భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande