డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలను
హైదబాద్ 16ఏప్రిల్( హిం.స) డా.బి.ఆర్. అంబేద్కర్ 133 వ జన
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలను


హైదబాద్ 16ఏప్రిల్( హిం.స) డా.బి.ఆర్. అంబేద్కర్ 133 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే

దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలను దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం, సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ ఆర్.ధనంజయులు హాజరయ్యారు. గౌరవ అతిథిగా ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ శ్రీ పి.కిషోర్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన ప్రధాన అధిపతులు, ఇతర ఉన్నతాధికారులు మరియు సిబ్బంది, ఎస్.సి.&ఎస్.టి; ఓ.బీ.సీ సంఘాల నుండి మరియు గుర్తింపు పొందిన కార్మిక సంఘాల నుండి సీనియర్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలతో సత్కరించారు.

ఈ సందర్భంగా శ్రీ ఆర్.ధనంజయులు మాట్లాడుతూ, భారతీయులను విద్య మరియు సామాజిక సంస్కరణల ద్వారా వారిలోని పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడం మరియు ప్రేరేపించడం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి గొప్పతనమని పేర్కొన్నారు. భారతీయులందరూ కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా డాక్టర్ అంబేద్కర్ గారి గొప్ప వారసత్వానికి లబ్ధిదారులని ఆయన పేర్కొన్నారు. డా.అంబేద్కర్ తన వ్యక్తిగత కుటుంబం సమస్యలు మరియు తన యొక్క ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా తుది శ్వాస వరకు అణగారిన వారి అభ్యున్నతి మరియు సమాజంలో సమానత్వం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని ఆయన అన్నారు. అదనపు జనరల్ మేనేజర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ డా.అంబేద్కర్ కేవలం విద్యావేత్త మాత్రమే కాకుండా, ఆర్థికవేత్త, రాజకీయవేత్త, సంఘ సంస్కర్త ,మహిళలు మరియు కార్మిక హక్కుల కోసం పోరాడేవారని తెలియజేశారు .

సామాజిక-ఆర్థిక స్థితిగతులు మరియు ఇతర అంశాలతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడిని స్వశక్తుడిని మరియు శక్తివంతుడిగా నిలిపేందుకు దీర్ఘకాల దృష్టితో రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు అందించారని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు మనం ఆ గొప్ప నాయకుని జన్మ దినాన్ని జరుపుకుంటున్న సంధర్భముగా మన నిబద్ధతను పునర్ సమీక్షించుకోవాలని మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిజమైన స్ఫూర్తిని అలవర్చుకోవాలని అన్నారు. తోటి భారతీయుడిని సమానత్వం మరియు గౌరవ భావంతో చూడాలనే విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భోదనలను ప్రతి ఒక్కరూ సమాజంలోని పిల్లలందరికి బోధించాలని, మన కార్యాలయంలోనే కాకుండా మన ఇళ్లలో కూడా ప్రతి ఒక్కరినీ సమానత్వంతో గౌరవించాలని ఆయన అన్నారు. ఆ మహానుభావుడిని గౌరవిద్దాం, ఆయన ఆశయాలకు అనుగుణంగా జీవిద్దాం అని పిలుపునిచ్చారు.

సభను ఉద్దేశించి శ్రీ పి.కిషోర్ బాబు మాట్లాడుతూ డా.బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జీవితం సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి దృఢత్వానికి, ప్రతిభకు, అచంచలమైన అంకితభావానికి గొప్ప నిదర్శనమని, భారత రాజ్యాంగం ప్రధాన రూపశిల్పిగా, భారత పౌరులందరికీ సమానత్వం, న్యాయం మరియు స్వేచ్ఛను నిర్ధారించే న్యాయమైన సమాజ నిర్మాణంకై వారు పాటుపడ్డారని తెలియజేశారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన అవిశ్రాంతమైన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆ మహానీయుని స్మృతిని గౌరవించడమే కాకుండా బాబా సాహెబ్ సిద్ధాంతాల పట్ల మనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించుకుందామని ఆయన అన్నారు. అంతకుముందు, దక్షిణ మధ్య రైల్వేకి చెందిన ఎస్.సి.&ఎస్.టి; ఓ.బీ.సీ మరియు గుర్తింపు రైల్వే ట్రేడ్ యూనియన్ నాయకులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పట్ల, తమ అభిప్రాయాలను వెల్లడించారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande