సీతారాముల కల్యాణోత్సవ మహోత్సవాలను ప్రత్యక్ష ప్రసారాలు చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి సంతోషదాయకం
హైదరాబాద్17,,ఏప్రిల్ (హిం.స) భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణోత్సవ మహోత్సవాలను ప్రత్యక్ష ప్రసారాలు చేస
సీతారాముల కల్యాణోత్సవ మహోత్సవాలను ప్రత్యక్ష ప్రసారాలు చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి సంతోషదాయకం


హైదరాబాద్17,,ఏప్రిల్ (హిం.స) భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణోత్సవ మహోత్సవాలను ప్రత్యక్ష ప్రసారాలు చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడం సంతోషదాయకం. ఇది రామ భక్తుల విజయం. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈసీ భుజంపై నుంచి తుపాకీ పెట్టి భద్రాద్రి శ్రీరాముడి కళ్యాణ మహోత్సవాల ప్రత్యక్ష ప్రసారాలను అడ్డుకోవాలని ప్రయత్నించినప్పటికి బిజెపి, రాముడి భక్తులు కేంద్రం ఎన్నికల కమిషన్ సంప్రదించి అనుమతులు తీసుకురావడం శుభ పరిణామం. ఈసీ అనుమతితో రేపు శ్రీరాముడి కల్యాణ మహోత్సవాలను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు. అవసరం లేకపోయినా అనుమతుల కోసం ఈసీని సంప్రదించిన అభాసుపాలైన రేవంత్ ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ సంతుష్టీకరణ రాజకీయాలకు స్వస్తి పలకాలి. ఒక వర్గం ఓట్ల కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande