బీఆర్ఎస్ హయాంలో మెదక్ నకు రైలు సౌకర్యం.. హరీష్ రావు..
మెదక్: ఏప్రిల్ 25 (హిం.స) బీఆర్ఎస్ హయాంలో మెదక్ నకు రైలు సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మాజ
బీఆర్ఎస్ హయాంలో మెదక్ నకు రైలు సౌకర్యం.. హరీష్ రావు..


మెదక్: ఏప్రిల్ 25 (హిం.స)

బీఆర్ఎస్ హయాంలో మెదక్ నకు రైలు సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి నేత హరీశ్ రావు అన్నారు. మెదక్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. “మా ప్రభుత్వంలో మంజీరాపై చెక్ డ్యామ్లు కట్టినందునే పంటలు ఎండిపోలేదు. ఈ ప్రాంతానికి మూడు మెడికల్ కళాశాలలు తీసుకువచ్చాం. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు బాండ్ పేపర్ రాసిచ్చారు. గతంలో బాండ్ పేపర్కు విలువ ఉండేది.. సీఎం రేవంత్ మోసంతో దాని విలువ కూడా పోయిందన్నారు.

ప్రజలు నమ్మడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికెళ్తే అక్కడి దేవుళ్లపై ఒట్టు పెడుతున్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ, ఆరు హామీలు అమలు చేయాలి. కేంద్రంలో భాజపా పాలనలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఏ ఒక్క వర్గానికీ మేలు చేయలేదు. పేదల గురించి బిజెపి ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ పార్టీ మాట నమ్మితే నీళ్లు లేని బావిలో దూకినట్లే” అని హరీశ్రావు అన్నారు.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచారం


 rajesh pande