జిల్లాలో ఇప్పటి వరకు రూ.16,19,06,105/- నగదు సీజ్: జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
హైదరాబాద్,, 25 ఏప్రిల్ (హిం.స) జిల్లాలో వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా ఇప్పటి వరకు రూ.16,19,06,
జిల్లాలో ఇప్పటి వరకు రూ.16,19,06,105/- నగదు సీజ్: జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్


హైదరాబాద్,, 25 ఏప్రిల్ (హిం.స) జిల్లాలో వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా ఇప్పటి వరకు రూ.16,19,06,105/- నగదుతో పాటు,7కోట్ల 15 లక్షల 87 వేల 579 రూపాయల విలువ గల ఇతర వస్తువులు, 21,284.11 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. 234 మందిపై కేసులు నమోదు చేసి 232 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ఎన్నికలకు సంబంధించిన నగదు, ఇతర వస్తువుల పై 470 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించారని, 314 మంది పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు, లైసెన్సు గల 2,995ఆయుధాలను డిపాజిట్ చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

బుధవారం ఉదయం 6 గంటల నుండి గురువారం ఉదయం 6 గంటల వరకు గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.4,10,000/-నగదు,

53,863/- రూపాయల విలువైన వస్తువులను పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. ఎక్సైజ్ శాఖ ద్వారా 119.21 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని, 10 కేసులు నమోదు చేసి 8 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నగదు ఇతర వస్తువులపై ,14 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామని, 11 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేసినట్లు తెలిపారు. 15 లైసెన్స్డ్ ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు ఆయన తెలిపారు.

హిందూస్తాన్ సమాచార్


 rajesh pande