పదేళ్లుగా తెలంగాణ ప్రజలను పీడించిన టిఆర్ఎస్
తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ ఏప్రిల్:25(హిం స)దేశంలో భారతీయ జనతా పార్టీ కులమతాల మధ్య చిచ్చుపెట్టి ఓ
*పదేళ్లుగా తెలంగాణ ప్రజలను పీడించిన టిఆర్ఎస్*


తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ ఏప్రిల్:25(హిం స)దేశంలో భారతీయ జనతా పార్టీ కులమతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకునే పద్ధతి అవలంబించుకుందని పిసిసి సభ్యులు బాబర్ ఖాన్ ఐఎన్టీయుసి రాష్ట్ర కార్యదర్శి రఘ మండిపడ్డారు. గురువారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బిజెపి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను వారు తీవ్రంగా కడించారు. రాజస్థాన్ లో ప్రధాని మోడీ ఆడపిల్లల పుస్తేల గురించి మాట్లాడి హిందూ సంప్రదాయాన్ని కించపరిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని, స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్రిటిష్ వారిని ఎదిరించి జైలు పాలైన ఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు. దేశభక్తులు అని చెప్పుకునే బిజెపి పార్టీ నాయకులు ఎవరైనా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారా అని వారు ప్రశ్నించారు. రాముని పేరు చెప్పి ఓట్లు అడుక్కునే బిజెపి పార్టీ దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 14 మంది ప్రధానమంత్రులుగా పనిచేసి 56 లక్షల కోట్ల అప్పులు చేస్తే కేవలం 10 ఏళ్లలో బిజెపి ప్రభుత్వం 100 లక్షల కోట్ల అప్పులను చేసిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటు పరం చేసిన ఘనత బిజెపి పార్టీదేనని ఎద్దేవా చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బిజెపి ఇచ్చిన హామీని మరిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగంలో ఇప్పటికి 60 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. నిత్యవసర సరుకుల ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్న బిజెపి పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నరేంద్ర మోడీ పాలనలో పుస్తెలు అమ్ముకొని జీవనం సాగించే పరిస్థితి తెచ్చారన్నారు. తెలంగాణలో రాజరిక పాలన చేసిన కేసీఆర్ అధికారం పోయిన తర్వాత బయటకు వచ్చి తిరుగుతున్నాడన్నారు. టిఆర్ఎస్ కు ఓటు వేస్తే బిజెపికి ఓటు వేసినట్లేనని, రెండు పార్టీలు ఒకటేనని అన్నారు.

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో మహబూబ్నగర్ ఎంపీగా పనిచేసిన మన్నే శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందన్నారని అలా అనడానికి సిగ్గుండాలి అని వారు మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు డిసెంబర్ నెలలో అయిందన్నారు. డిసెంబర్ నుండి ఏప్రిల్ మధ్య ఎక్కడైనా వర్షాలు పడతాయా అని వారు ప్రశ్నించారు. ఎంపిక గెలిచిన నాటినుండి ఎన్నిసార్లు నియోజకవర్గానికి వచ్చావని, అసలు షాద్ నగర్ నియోజకవర్గం గురించి నీకు తెలుసా అని వారు ప్రశ్నించారు. ఇక టిఆర్ఎస్ చేస్తున్నట్లు విద్యుత్ అంతరాయం విషయంలో బహిరంగ సవాల్ కు సిద్ధమన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఇబ్రహీం, కేశంపేట మండలం పార్టీ అధ్యక్షుడు వీరేశం, హరినాథ్ రెడ్డి, భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..

జనార్థన్ రెడ్డి రంగా రెడ్డి జిల్లా హిందుస్థాన్ సమాచార్


 rajesh pande