ఉషోదయ సూపర్ మార్కెట్ ప్రహరీ గోడ నిర్మాణం కూల్చివేత వివాదం
తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ ఏప్రిల్:25(హిం స)ద్ నగర్: షాద్ నగర్ చౌరస్తా నుంచి జాతీయ రహదారి ''వై''
*ఉషోదయ సూపర్ మార్కెట్ ప్రహరీ గోడ నిర్మాణం కూల్చివేత వివాదం*


తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ ఏప్రిల్:25(హిం స)ద్ నగర్: షాద్ నగర్ చౌరస్తా నుంచి జాతీయ రహదారి ''వై'' జంక్షన్ వరకు- కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనుల కోసమే సూపర్ మార్కెట్ భవన ప్రహరీ గోడ కూల్చామని చెబుతున్న స్థానిక అధికారుల విషయంలో వివాదం రాజుకుంది.

ఈ గోడను కూల్చివేసింది ఆర్ అండ్ బి అధికారులే అని స్థానిక మున్సిపల్ కమిషనర్ వెంకన్న బాబు చెబుతుండగా మున్సిపల్ అధికారులే కూల్చారు తమకు సంబంధం లేదు. వాళ్ళు పిలిస్తే వెళ్లాం అంటూ ఆర్ అండ్ బి ఏఈ రాజశేఖర్ చెబుతున్నాడు. ఇరువురు అధికారులు చెబుతున్న వ్యవహారంలో ఏది నిజం దేవుడెరుగు..! కానీ ఈ వ్యవహారంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ కే. నరేందర్ దీనికి కారణం అంటూ ఓ బాధితుడు మీడియాకు ఎక్కాడు. బుధవారం నవోదయ సూపర్ మార్కెట్ భవన ప్రహరీని మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. షాద్ నగర్ చౌరస్తా నుంచి వై జంక్షన్ వరకు నాలుగు లైన్ల రోడ్డు పనులు జరుగుతున్నాయి. రోడ్డు మధ్యలో రెండు మీటర్ల డివైడర్ ను నిర్మిస్తారు. డివైడర్ కు ఇరువైపులా 8.75 మీటర్ల బీటీ రోడ్డును వేయనున్నారు. డివైడర్ నుంచి 75 ఫీట్ల లోపు డ్రైనేజ్ కాలువను, డ్రైనేజ్ కాలువ వెలుపల 25 ఫీట్లలో సర్వీసు రోడ్డును నిర్మిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నిర్మాణాలు అడ్డు లేని ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఇతరుల నిర్మాణాలను కూల్చకుండా తన భవన ప్రహారీని కూల్చివేడం సరికాదని నవోదయ సూపర్ మార్కెట్ భవన యజ మాని మండవ మురళీధర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి ప్రహరీ గోడలు కూల్చకుండా కేవలం తన ప్రహరీ గోడను కూల్చివేశారని మీడియాకు ఆరోపిస్తున్నారు.

ఉషోద సూపర్ మార్కెట్ భవనానికి పక్కనే ఉన్న షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ కే. నరేందర్ స్థలానికి వాస్తు దోషంగా తన ప్రహరీలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉందని గతంలో పలుసార్లు ఈ విషయం తన దృష్టికి తీసుకు వచ్చారని, అయితే ఈ విషయంలో తనను పలుసార్లు మున్సిపల్ కార్యాలయం నుండి తన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అడిగారని చెప్పారు. కన్స్ట్రక్షన్ జరిగిన భవనాన్ని ఎంతోమంది అమ్మాక తాను కొన్నానని, ఇప్పుడు తను భవనం కొనగానే ఇలాంటి ఇబ్బందులు సృష్టిస్తున్నారని మండవ మురళీధర్ రావు మీడియాకు తెలిపారు. .

గతంలో తాను ఉషోదయ సూపర్ మార్కెట్ భవన సముదాయాన్ని కొన్నానని బాధితుడు మండవ మురళీధర్ రావు తెలిపారు. అప్పట్లో గత యజమానులతో లేని విభేదాలు తనతో ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. బతుకుదెరువు కోసం వచ్చిన వాళ్ళు ఇతర ప్రాంతానికి చెందిన వారు వ్యాపారం కోసం ఇక్కడికి వస్తే ఇలా భయపెట్టి జూలుం జబర్దస్తి చేసి ఇలా తమ ఆస్తులను ధ్వంసం చేస్తారా అని మండవ మురళీధర్ రావు మీడియాకు తన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ నరేందర్ చేతిలో అధికారం ఉంది కదా అని తమలాంటి అమాయకులపై ఇలాంటి తెరచాటు నాటకాలు ఆడిస్తే సహించేది లేదని తాము కూడా న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తామని అన్నారు. రోడ్డు విస్తరణ పనుల పేరిట అధికారులు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రజాప్రతినిధికి మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మురళీధర్ రావు ఆరోపించారు..

జనార్థన్ రెడ్డి రంగా రెడ్డి జిల్లా హిందుస్థాన్ సమాచార్


 rajesh pande