ఇకనుండి ఎక్కడి నుండైనా జనరల్ టికెట్స్ లను బుక్ చేసుకునేలా రైల్వే శాఖ నిర్ణయం..
హైదరాబాద్: ఏప్రిల్ 26 (హిం.స) కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధాన
ఇకనుండి ఎక్కడి నుండైనా జనరల్ టికెట్స్ లను బుక్ చేసుకునేలా రైల్వే శాఖ నిర్ణయం..


హైదరాబాద్: ఏప్రిల్ 26 (హిం.స)

కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. దీంతో రైల్వేశాఖ గతంలోనే యూటీఎస్(అర్రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్) యాప్ను తీసుకువచ్చింది. బుకింగ్ కేంద్రాల వద్ద బారులుతీరకుండా ఫోన్లోనే సులువుగా జనరల్ టికెట్లు తీసుకునే వీలు కల్పించింది. అయితే స్టేషన్కు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉండేది. దీంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించిన రైల్వేశాఖ తాజాగా ఎంత దూరం నుంచైనా టికెట్లు పొందేలా వీలు కల్పించింది. అంటే ఇకపై ఇంట్లో ఉండగానే టికెట్ తీసుకుని సమయానికి వచ్చి రైలు ఎక్కవచ్చు. ప్లాట్ఫామ్ టికెట్లనూ పొందవచ్చు. కానీ స్టేషన్కు 50 మీటర్లలోపు మాత్రం ఈ యాప్ పనిచేయదు.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచార్


 rajesh pande