బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలి
విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 26(హిం.స): బాల కార్మిక వ్యవస్థ సంపూర్ణంగా నిర్మూలించాలని పలువురు వ
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలి


విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 26(హిం.స): బాల కార్మిక వ్యవస్థ సంపూర్ణంగా నిర్మూలించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఈ నెల 30 వ తేదీన జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినం సందర్భంగా బాల వికాస ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ముద్రించిన పోస్టర్ ను శుక్రవారం ఎం వి పి కాలనీ లో గల ఎస్ వి వి పి వి ఎం సి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీశ్వర రావు ఛాంబర్ లో సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి నర వ ప్రకాశ రావు జగదీశ్వర రావు తో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు.. స్వచ్ఛంద సంస్థలు సమన్వయం తో పనిచేసి నప్పుడే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్య మవుతుంది అని అన్నారు. నగరం లో బాల కార్మికులు పెరుగుతూనే అన్నారు ముఖ్యంగా కో విద్ తరువాత వీరి సంఖ్య బాగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నరవ ప్రకాశ రావు మాట్లాడుతూ ఏప్రిల్ 30 జాతీయ బాల కార్మిక దినం సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజలలో అవగాహన కల్పించేందుకు నగరంలో పలు ప్రాంతాలలో పోస్టర్ లను అతికించి కరపత్రాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్ జ్ఞానేశ్వర్ బాబ్జీ, డాక్టర్ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

- కృష్ణమూర్తి, హిందూస్తాన్ సమాచార్.


 rajesh pande