థాయిలాండ్ వేదికగా జరుగుతున్న రెజ్లింగ్ ఛాంపియన్ పోటీల్లో అదరగొడుతున్న భారత అథ్లెట్లు.
తెలంగాణ స్పోర్ట్స్ జూలై 18 హిం.స: భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. థాయ్ లాండ్ వేదికగా జరుగుతున్న ఏషియన్ అండర్-15 రెజ్లింగ్ (కుస్తీ) చాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమైన రెండో రోజున భారత మహిళా అథ్లెట్లు ఏకంగా పదికి పది పతకాలను సాధించారు. మహిళా రెజ్లింగ్ ఫై
అదరగొడుతున్న భారత  క్రీడాకారులు


తెలంగాణ స్పోర్ట్స్ జూలై 18 హిం.స: భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు.

థాయ్ లాండ్ వేదికగా జరుగుతున్న ఏషియన్ అండర్-15 రెజ్లింగ్ (కుస్తీ) చాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమైన రెండో రోజున భారత మహిళా అథ్లెట్లు ఏకంగా పదికి పది పతకాలను సాధించారు. మహిళా రెజ్లింగ్ ఫైనల్ సెషన్లో భారత్ వర్సెస్ జపాన్ మ్యాచ్ అప్లు ఆధిపత్యం చెలాయించాయి. మొత్తం ఆరు ఎన్ కౌంటర్లలో జపాన్ నాలుగు విజయాలతో అగ్రస్థానంలో ఉండగా.. రువీన్ (62 కేజీలు), గరిమా (66 కేజీలు) జపాన్ ప్రత్యర్థులను ఓడించి స్వర్ణం సాధించారు. అంతకుముందు రోహిణి దేవ్బా (33 కేజీలు), ఆయుష్క గడేకర్ (58 కేజీలు) కూడా ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్ రెజ్లర్లను ఓడించి స్వర్ణ పతకాలు సాధించారు. అయితే, వినాక్షి ఫ్ను (36 కేజీలు), కస్తూరి కదమ్ (39 కేజీలు), రుతుజా గురవ్ (46 కేజీలు), కనిష్క ఫ్ను (50 కేజీలు), మోని (54 కేజీలు) తమ ఫైనల్స్లో ఓడి రజత పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, మహిళా రెజ్లర్ మేఘా (42 కిలోలు) మాత్రం ఫైనల్కు చేరుకోలేకపోయినా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

ఇక గ్రెకో-రోమన్ పురుషుల బృందం సైతం పోటీలు ప్రారంభమైన తొలిరోజే 4 మెడల్స్ సాధించారు. వారిలో అనూప్ కుమార్ (38 కిలోలు), యష్ కమన్న (41 కిలోలు), ధన్రాజ్ జమ్నిక్ (48 కిలోలు) రజత పతకాలను గెలుచుకోగా, ప్రన్షిత్ అహ్లావత్ హెవీవెయిట్ విభాగంలో (85 కిలోలు) రౌండ్-రాబిన్లో మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.దీంతో ఏషియన్ అండర్ -15 రెజ్లింగ్ పోటీల్లో ఇప్పటివరకు భారత్ మొత్తంగా 14 పతకాలను సాధించడం విశేషం.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్ / నాగరాజ్ రావు


 rajesh pande