సుమారు 6 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న మేడ్చల్ పోలీసులు
హైదరాబాద్ జూలై 24 హిం.స రాష్ట్రంలో మాదకద్రవ్యాలను అరికట్టే విషయంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ మేరకు డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్గా ఎవరు పట్టుబడినా.. తీసుకున్నా వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలంటూ ఇప్పటికే క్లియర్గా పోలీసు శాఖకు ఆదేశాలు అంద
భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం


హైదరాబాద్ జూలై 24 హిం.స రాష్ట్రంలో మాదకద్రవ్యాలను అరికట్టే విషయంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ మేరకు డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్గా ఎవరు పట్టుబడినా.. తీసుకున్నా వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలంటూ ఇప్పటికే క్లియర్గా పోలీసు శాఖకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు రాష్ట్రంలోని టాస్క్ ఫోర్స్, ఎస్వోటీ, నార్కోటిక్ బ్యూరో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు,పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, పబ్బులు, క్లబ్లు,గోడౌన్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపడతున్నారు.

గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని ఎక్కడికక్కడ కేసు నమోదు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మేడ్చల్ మల్కాజ్గిరి

జిల్లాలో ఎస్వోటీ పోలీసులు భారీ ఎత్తున డ్రగ్స్ సీజ్ చేశారు.

మూడు చింతలపల్లి మండల పరిధిలోని పోతారం చౌరస్తాలో ఓ అద్దె ఇంట్లో ఆస్ ప్రో బయో (లైసెన్స్ కాల పరిమితి ముగిసిన) డ్రగ్స్ నిల్వ ఉంచారనే సమాచారం మేరకు ఆ గోడౌన్పై టాస్క్ఫోర్స్, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు మెరుపు దాడి చేశారు. అక్కడ అక్రమంగా నిలువ ఉంచిన 60 రకాల రూ.96 లక్షలు విలువ చేసే డ్రగ్స్ను వారు గుర్తించారు. దాడుల్లో డిప్రెషన్ కంట్రోల్, యూరిన్ కంట్రోల్తో పాటు పలు రకాల వ్యాధులకు తయారు చేసే మెడిసిన్స్ కొరియర్ ద్వారా ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఓపెన్ మార్కెట్లో ఆ డ్రగ్స్ విలువ సుమారు రూ.6 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ నిలువ చేసిన ప్రాంతం గోడౌన్ అస్పిన్ బయో ఫార్మాకు చెందినదిగా గుర్తించారు. కాడారి సతీష్రెడ్డి పేరుతో ఆ గోడౌన్ ఉన్నట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాగా, అతడిపై గతంలో పలు కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్.. / నాగరాజ్ రావు


 rajesh pande