మహబూబాబాద్ జూలై 27 హిం.స : ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో
పడి పంచాయతీ సెక్రెటరీ మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దంతలపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ సెక్రటరీ విధులు నిర్వహిస్తున్న పేర్ల వెంకటేష్ శనివారం ఉదయం ప్రమాదవశాత్తు మండలం కేంద్రంలో కంఠాయపాలెం రోడ్డులోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లు వర్ధన్నపేట ఫైర్ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని బావిలో నుండి బయటికి తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్.. / నాగరాజ్ రావు