బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి రిషి సునాక్ ఓటమి..
లండన్ , జూలై 5 (హిం.స)బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ, లేబర్ పార
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి రిషి సునాక్ ఓటమి..


లండన్ , జూలై 5 (హిం.స)బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ, లేబర్ పార్టీ 359 సీట్లు గెలుచుకోగా, ప్రధాన మంత్రి రిషి సునక్ కన్జర్వేటివ్ పార్టీ కేవలం ఎనభై మాత్రమే సాధించింది. ఈ నేపథ్యంలో 14 సంవత్సరాల కన్జర్వేటివ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ముగింపు పలికి, కైర్ స్టార్మర్ తదుపరి బ్రిటన్ ప్రధాని కానున్నారు. ఇదిలా ఉంటే ప్రధాన మంత్రి రిషి సునక్ ఎన్నికలలో ఓటమిని అంగీకరించారు. తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, క్షమించండి, ఓటమికి బాధ్యత వహిస్తున్నా అని అన్నారు. ఈ ఎన్నికలలో లేబర్ పార్టీ విజయం సాధించింది, కైర్ స్టార్మర్కు ఫోన్ చేసి వారి విజయానికి అభినందనలు తెలిపారు. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుంది. మన దేశ స్థిరత్వం, భవిష్యత్తుపై మనందరికీ విశ్వాసం ఉందని రిషి సునక్ అన్నారు.

ఉదయం 9.50 గంటల సమయం నాటికి మొత్తం 650 సీట్లకు గాను 515 సీట్ల ఫలితాలను ప్రకటించారు. మరోవైపు కైర్ స్టార్మర్ తదుపరి బ్రిటన్ ప్రధాని కానుండటంతో పలు దేశాధినేతల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కెనడా ప్రధాన మంత్రి, జస్టిన్ ట్రూడో, ఎక్స్లో ఒక పోస్ట్లో కైర్ స్టార్మర్ను అభినందించారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande