ఆషాడ మాసం కావడంతో తగ్గుతున్న బంగారం ధరలు
తగ్గుతున్న బంగారం ధరలు


Telangana,8 జూలై (హి.స.)

కొద్ది కాలంగా పసిడి రేట్లలో హెచ్చు తగ్గులు జరుగుతుండటంతో కొనుగోలు దారుల్లో టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం ఆషాడ మాసం కావడంతో బంగారం ధరలు తగ్గుతూ శుభవార్తను అందిస్తున్నాయి. నిన్నటి రేట్లతో పోల్చుకుంటే నేడు బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.200 తగ్గగా రూ. 67, 450కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 220 తగ్గి రూ. 73,580కి విక్రయిస్తున్నారు. ఇక కిలో వెండిపై రూ.200 పెరగడంతో రూ. 99500 గా ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

హైదరాబాద్లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 67,450

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 73, 580

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 67,450

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 73, 580

హిందూస్తాన్ సమచార్ / Bachu Ranjith Kumar


 rajesh pande