ఆఫ్ఘనిస్తాన్, 21 ఆగస్టు (హి.స.)
ఎక్కడైనా లంచం తీసుకున్న
అధికారులనో లేదా విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారినో డ్యూటీ నుంచి తొలగించడం చూశాం, కానీ అఫ్గానిస్థాన్ దేశంలో విచిత్రంగా గడ్డం లేని కారణంగా 281 మంది భద్రతా సిబ్బందిని తొలగించారు. గడ్డం పెంచడంలో విఫలమైనందుకు తాలిబాన్ నైతిక మంత్రిత్వ శాఖ వారిని డ్యూటీ నుంచి తొలగించింది. ఇస్లామిక్ చట్టానికి అనుగుణంగా తాలిబన్ లో పని చేసే ప్రతి ఒక్కరు గడ్డం పెంచుకోవాలని లేని పక్షంలో వారిని డ్యూటీ నుంచి తొలగిస్తామని తాలిబన్ ప్రభుత్వం తెలిపింది. అలాగే అఫ్గానిస్థాన్ దేశంలో గత సంవత్సరం నుండి అనైతిక చర్యలకు పాల్పడిన 13,000 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్.. / నాగరాజ్ రావు