చెన్నై, 21 ఆగస్టు (హి.స.)
పారిస్ ఒలింపిక్స్ పతక విజేత మను
భాకర్.. యువ క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపేందుకు దేశ వ్యాప్తంగా పర్యటిస్తోంది. అందులో భాగంగానే చెన్నైలోని వెలమ్మాళ్ నెక్సస్ స్కూల్ ను సందర్శించింది. ఈ స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో తన జీవిత అనుభవాలను స్టుడ్డెంట్స్ తో పంచుకుంది. 22 ఏళ్ల మను భాకర్ మాట్లాడుతూ.. క్రీడలను కెరీర్ ఎంచుకుంటే జీవితం చాలా అందంగా ఉంటుందని అన్నారు. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లే కాదు ! పెద్ద కలలు కనాలని, వాటికోసం కఠిన దీక్ష చేయాలని మను తెలిపారు. కలలు సాకారం కానంత మాత్రాన నిరాశ చెందకూడదని అన్నారు. లక్ష్యం కోసం నిరంతరం పని చేయాలని, ఎప్పుడూ ఆత్మ విశ్వాసం తో ఉండాలని.. కెరీర్ లో గొప్ప స్థితికి వెళ్ళడానికి ఎన్నో మార్గాలున్నాయని వెల్లడించారు. తన కెరీర్ లో చాలా విభిన్నమైన పరిస్థితులను, సంస్కృతులను చూశానని.. తన ఎనిమిదేళ్ల వయసులోనే ప్రపంచమంతా తిరిగానని చెప్పింది. అయితే మన సాంస్కృతిక నేపథ్యం గురించి మనమెప్పుడూ సిగ్గు పడకూడదని, వాటిని చూసి గర్వపడాలని చెప్పుకొచ్చారు మను భాకర్.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్ / నాగరాజ్ రావు