పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.. హైదరాబాద్ సిపి
హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.) ఈ రోజుల్లో పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో యువత విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయికి బానిసలుగా మారుతున్నారన
హైదరాబాద్ పోలీస్ కమిషనర్


హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.)

ఈ రోజుల్లో పిల్లల విషయంలో

తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో యువత విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయికి బానిసలుగా మారుతున్నారని పేర్కొన్నారు. ఎవరూ డ్రగ్స్ తో పట్టుబడినా వారిపై వెంటనే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరంలో ఎక్కడైనా.. డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా వారు శిక్షార్హులు అవుతారని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రింక్స్లో డ్రగ్స్ కలిపి పిల్లలకు అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్నారని వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టామని స్పష్టం చేశారు. ఇళ్లలో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు.. ఎవరిని కలుస్తున్నారు అనే విషయాలపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్ / నాగరాజ్ రావు


 rajesh pande