కర్నూలు జిల్లాలో విషాదం.. రైలు కింద పడి ఇద్దరు ఆత్మహత్య
కర్నూల్, ఏ.పీ 28 ఆగస్టు (హి.స.) కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కర్నూల్ జిల్లా మద్దికేర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఇద్దరు ఆత్మ హత్య చేసుకున్నారు. మృతుల్లో ఒకరు మహిళ ఉన్నారని పోలీసులు గుర్తించారు.. మృతి చెందిన వారి సమీపంలో ఒక నోట్
కర్నూలు జిల్లాలో విషాదం


కర్నూల్, ఏ.పీ 28 ఆగస్టు (హి.స.)

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కర్నూల్ జిల్లా మద్దికేర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఇద్దరు ఆత్మ హత్య చేసుకున్నారు. మృతుల్లో ఒకరు మహిళ ఉన్నారని పోలీసులు గుర్తించారు..

మృతి చెందిన వారి సమీపంలో ఒక నోట్ బుక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు . మృతులు ఒకే కుటుంబ సభ్యులా, ప్రేమ జంటనా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమా, ఆర్థిక ఇబ్బందులా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతులు అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ప్రతాప్ సింగ్ కుమార్తె మీనా, థామస్ గా గుర్తించారు. గుంతకల్లు లో కసాపురం రోడ్డులో రామలింగ కాంప్లెక్స్ లో నివాసం అని సమాచారం. బుక్ లో ఫోన్ నెంబర్లు 8074441373, 8919152480 రాసి ఉన్నట్టు సమాచారం.

మా ఆత్మహత్యకు ఎవరు బాధ్యులు కాదు అంటూ నోట్ బుక్ లో నమోదు చేశారని పోలీసులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్ / నాగరాజ్ రావు


 rajesh pande