వినోదం, 29 ఆగస్టు (హి.స.)
: టాలీవుడ్ హీరోలైన మెగాస్టార్
చిరంజీవి-కింగ్ నాగార్జున గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి మధ్య మంచి ఫ్రెంన్షిప్ మాత్రమే కాకుండా మెగాస్టార్ అండ్ అక్కినేని ఫ్యామిలీ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఈ కారణంగానే బాక్సాఫీస్ వద్ద నాగార్జున-మెగాస్టార్ మధ్య ఎలాంటి గొడవలు రాలేదని చెప్పుకోవచ్చు. వీరిద్దరు కలిసి గతంలో త్రిమూర్తులు అనే సినిమాలో కూడా నటించారు. నాగార్జున, చిరంజీవి ఇందులో గెస్ట్ రోల్గా నటించారు. కానీ ఎవరికీ అంతగా తెలియదు. కె మురళీ మోహన్రావు దర్శకత్వం వహించిన ఈ మూవీలో వెంకటేష్, అర్జున్, రాజేంద్రప్రసాద్ హీరోలుగా నటించారు.
ఈ చిత్రం 1987లో విడుదలైంది. నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా నెటిజన్లకు ఈ విషయం తెలియడంతో చిరు-నాగ్ కలిసి ఒకే సినిమాలో కలిసి నటించారా? అంటూ షాక్ అవుతున్నారు. ప్రజెంట్ నాగ్- చిరు కలిసి ఒకే మూవీలో కలిసి నటిస్తే చూడాలని ఉందని కోరుకుంటున్నారు. ఇకపోతే నేడు నాగార్జున పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి 링 ప్రియమైన సోదరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాగార్జున!మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలో మరింత బలమైన వ్యక్తిగా కొనసాగండి! అంటూ మెగాస్టార్ చిరంజీవి.. కింగ్ నాగార్జునకు బర్త్ డే విషెష్ తెలియజేశారు. ప్రస్తుతం చిరంజీవి ట్విట్టర్ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..