రూ. 35 లక్షల విలువైన 140 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న జహీరాబాద్ పోలీసులు
జహీరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.) జహీరాబాద్ పోలీసులు టాస్క్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్ లో రూ.35 లక్షల విలువైన 140 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ. చెన్నూరి రూపేష్ చెప్పారు. గంజాయిని తరలిస్తున్న కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా, బల్కి తాలూకాల
140 కిలోల గంజాయి స్వాధీనం


జహీరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)

జహీరాబాద్ పోలీసులు టాస్క్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్ లో రూ.35 లక్షల విలువైన 140 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ. చెన్నూరి రూపేష్ చెప్పారు. గంజాయిని తరలిస్తున్న కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా, బల్కి తాలూకాలోని శంషాపూర్ వాడి గ్రామానికి చెందిన లఖన్ (29), బాల్కి లోని బసవేశ్వర్ చౌక్ బీర్ దేవ్ గల్లీ వాసి సిద్దిరామ్ (28) ఇద్దరిని డిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంగళవారం చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి స్మగ్లింగ్ వివరాలు వెల్లడించారు.. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మీదుగా మహారాష్ట్ర తరలిస్తున్న 140 కిలోల ఎండు గంజాయితో పాటు ఇద్దరు స్మగ్లర్లు, మహీంద్రా బొలెరో మ్యాక్స్ పికప్ వాహనం, రెండు సెల్ ఫోన్ లు నాలుగు సిమ్ కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande