ఖ‌మ్మం జిల్లా ఇల్లందు మైనార్టీ పాఠ‌శాల‌లో  ఏసీబీ దాడి.. లంచం డిమాండ్ చేసిన హెచ్ఎం అరెస్ట్..
తెలంగాణ, ఖ‌మ్మం 9 జనవరి (హి.స.) జిల్లా ఇల్లందు మైనార్టీ పాఠ‌శాల‌లో గురువారం ఏసీబీ దాడి చేసి, లంచం డిమాండ్ చేసిన ప్ర‌ధానోపాధ్యాయుడు భీమ‌న‌ప‌ల్లి కృష్ణ‌ను ప‌ట్టుకున్నారు. ఒక మహిళ ఉపాధ్యాయురాలు జీతం బిల్లు జారీ చేయ‌డానికి రెండు వేల రూపాయ‌లు డిమాండ్ చ
ఏసీబీ రైడ్స్


తెలంగాణ, ఖ‌మ్మం 9 జనవరి (హి.స.)

జిల్లా ఇల్లందు మైనార్టీ పాఠ‌శాల‌లో గురువారం ఏసీబీ దాడి చేసి, లంచం డిమాండ్ చేసిన ప్ర‌ధానోపాధ్యాయుడు భీమ‌న‌ప‌ల్లి కృష్ణ‌ను ప‌ట్టుకున్నారు. ఒక మహిళ ఉపాధ్యాయురాలు జీతం బిల్లు జారీ చేయ‌డానికి రెండు వేల రూపాయ‌లు డిమాండ్ చేయడంతో ఆ టీచ‌ర్ ఏసీబీని ఆశ్ర‌యించారు. ఏసీబీ అధికారులు ప్రణాళిక ప్ర‌కారం దాడి చేసి హెచ్ఎం భీన‌ప‌ల్లి కృష్ణ‌ను ప‌ట్టుకున్నారు.

ఇల్లందు మైనార్టీ పాఠశాలలో ఒక టీచ‌ర్ జీతం బిల్లు చేయడానికి పది వేల రూపాయలను ప్ర‌ధానోపాధ్యాయుడు భీన‌ప‌ల్లి కృష్ణ డిమాండ్ చేశారు. అయితే అంతా ఇచ్చుకోలేను రెండు వేల రూపాయ‌లు ఇస్తాన‌ని హెచ్ఎంను వేడుకోగా అతను ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించారు. ఏసీబీ వేసిన ప్ర‌ణాళిక ప్ర‌కారం హెచ్ఎం కృష్ణ‌కు గురువారం ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కు రూ.రెండు వేలు ఇవ్వగా, ఆ డ‌బ్బులు అటెండర్ కు ఇవ్వాల‌ని చెప్ప‌డంతో అలానే డ‌బ్బులు ఇచ్చారు. ఇంత‌లో ఏసీబీ అధికారులు దాడి చేశారు. హెచ్ఎం అవినీతికి పాల్ప‌డిన‌ట్లు రుజువు కావ‌డంతో ఆయ‌న్ని అదుపులోకి తీసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande