సైబ‌ర్ నేర‌గాళ్ల‌పై పోలీసుల నిఘా ..23 మంది అరెస్ట్
తెలంగాణ/ఏ.పీ, 10 జనవరి (హి.స.) సైబ‌ర్ నేర‌గాళ్ల ఆగ‌డాల‌కు తెలంగాణ పోలీసులు చెక్ పెడుతున్నారు. స్టాక్ మార్కెట్లు , ట్రేడింగ్‌ లో పెట్టుబడి పెడితే రెండింతలు లాభం వస్తుందని నమ్మించి ముంచేస్తున్నారు. ఈ క్ర‌మంలో అలాంటి వారిపై తెలంగాణ పోలీసులు నిఘా వేశారు
సైబర్ నేరగాళ్లు


తెలంగాణ/ఏ.పీ, 10 జనవరి (హి.స.)

సైబ‌ర్ నేర‌గాళ్ల ఆగ‌డాల‌కు తెలంగాణ పోలీసులు చెక్ పెడుతున్నారు. స్టాక్ మార్కెట్లు , ట్రేడింగ్‌ లో పెట్టుబడి పెడితే రెండింతలు లాభం వస్తుందని నమ్మించి ముంచేస్తున్నారు. ఈ క్ర‌మంలో అలాంటి వారిపై తెలంగాణ పోలీసులు నిఘా వేశారు.

23 మంది అరెస్టుసైబర్ క్రైమ్ కేసుల్లో కీలక నిందితులుగా ఉన్న వారిని పట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక , ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌ లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 23 మంది సైబర్ నేరగాళ్లను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై దేశ వ్యాప్తంగా 328 కేసులు, తెలంగాణలో 30 కేసుల్లో కీలక నిందితులుగా ఉన్నట్లుగా తేలింది. ఈ మేరకు నిందితుల నుంచి సెల్‌ఫోన్లు , చెక్‌ బుక్స్, సిమ్ కార్డు లను స్వాధీనం చేసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande