హైడ్రా విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై కేసు నమోదు
హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.) మాదాపూర్ లోని సున్నం చెరువు పరిధిలోని హైడ్రా అధికారులు ఆక్రమణలు కూల్చివేస్తున్న సమయంలో ముగ్గురు అడ్డుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. తాజాగా వారిపై కేసు నమోదైంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించారని హైడ్రా
ముగ్గురిపై కేసు నమోదు


హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)

మాదాపూర్ లోని సున్నం చెరువు

పరిధిలోని హైడ్రా అధికారులు ఆక్రమణలు కూల్చివేస్తున్న సమయంలో ముగ్గురు అడ్డుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. తాజాగా వారిపై కేసు నమోదైంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించారని హైడ్రా అధికారులు కేసు నమోదు చేశారు. కాగా, కూల్చివేతలు ప్రారంభించిన వెంటనే.. కిరోసిన్తో ముగ్గురు అక్కడకు చేరుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసుకుంటామని బెదిరించారు. తమ భవనాలు కూల్చివేస్తే ఒంటికి నిప్పంటించుకుంటామని.. అధికారులను హెచ్చరించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని అధికారులను నిలదీశారు. తాము పిల్లాపాపలతో ఉన్నాం ఎక్కడికి వెళ్లాలంటూ వారు గగ్గోలు పెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande