చెన్నై , 11 సెప్టెంబర్ (హి.స.)పరీక్షల్లో విద్యార్థులు రాసే సమాధాన పత్రాల్ని కృత్రిమ మేధతో (ఏఐ) దిద్దించే ప్రయోగానికి తమిళనాడు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు యూనివర్సిటీల పరిధిలో ఇందుకు సంబంధించిన ప్రయోగాలు (ట్రయల్స్) నడుస్తున్నాయి. ఈ ఏడాదిలోపు ప్రాజెక్టును పూర్తి చేసి.. ఈ విధానంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఏఐ సాంకేతికత పనితీరును సరిగ్గా అన్వయించటంతో పాటు లోపాల్ని సవరించి.. సమగ్ర ఫలితాలు వచ్చిన తర్వాత, అన్ని వర్సిటీల్లో అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీన్ని ఆ రాష్ట్ర ప్రణాళికా కమిషన్ పర్యవేక్షిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు