తెలంగాణ/ఏ.పీ, 15 జనవరి (హి.స.)
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఏర్పాటు చేసిన తిరుమల శ్రీవారి నమూనా ఆలయం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి నిత్య కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాల తరహాలో తిరుప్పావై సేవ, తోమాలసేవ, కొలువు, సహస్ర నామార్చన నిర్వహించారు. భక్తులను స్వామివారి ప్రసాదాలు వితరణ చేశారు. వాహన మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి వేడుకగా ఊంజల్ సేవ నిర్వహించారు. నిన్న సాయంత్రం 6 గంటల వరకు 7,083 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..