మహా కుంభమేళాలో నిన్న ఒక్కరోజే 3.5 కోట్ల మంది భక్తులు!
ప్రయాగ్‌రాజ్‌ 15 జనవరి (హి.స.)ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళాకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. నిన్న (జనవరి 14) మకర సంక్రాంతి పండగను పురస్కరించుకుని వివిధ అఖాడాల నుంచి వేలాదిగా వచ్చిన సాధువులు తొలి పుణ్య స్న
మహా కుంభమేళాలో నిన్న ఒక్కరోజే 3.5 కోట్ల మంది భక్తులు!


ప్రయాగ్‌రాజ్‌ 15 జనవరి (హి.స.)ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళాకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. నిన్న (జనవరి 14) మకర సంక్రాంతి పండగను పురస్కరించుకుని వివిధ అఖాడాల నుంచి వేలాదిగా వచ్చిన సాధువులు తొలి పుణ్య స్నానాలు చేయగా.. తెల్లవారుజామునే 3 గంటల సమయంలో బ్రహ్మ ముహూర్తంలో పుణ్యస్నానాలు స్టార్ట్ అయ్యాయి. ఒక్కరోజే సుమారు 3.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

అయితే, కుంభమేళా సమయంలో అమృత్‌ స్నాన్‌కు ప్రత్యేకమైన స్థానముంది. దీంతో భారీ సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలి వచ్చి పుణ్య స్నానాలు చేశారు. వాళ్లు కేవలం కుంభమేళా సమయంలోనే వస్తుంటారు. ఈ క్రమంలోనే మంగళవారం నాడు ఒంటినిండా భస్మాన్ని పూసుకుని ఈటెలు, త్రిశూలాలు, డమరుక నాదాలను చేతిలో పట్టుకుని వేల మంది నాగ సాధువులు ఊరేగింపుగా పుణ్యస్నానాలకు బయలుదేరి వచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande