హమాస్‌ దాడుల విషయంలో నిఘా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ రాజీనామా
టెల్‌అవీవ్‌:13 సెప్టెంబర్ (హి.స.) అక్టోబరు 7నాటి హమాస్‌ దాడులతో ఇజ్రాయెల్‌ ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ భద్రతా అధికారులు క్షమాపణలు సైతం చెప్పారు. ఈక్రమంలో ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ ‘యూనిట్‌ 8200’ చీఫ్‌గా బాధ్యతలు నిర్వ
హమాస్‌ దాడుల విషయంలో నిఘా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ రాజీనామా


టెల్‌అవీవ్‌:13 సెప్టెంబర్ (హి.స.) అక్టోబరు 7నాటి హమాస్‌ దాడులతో ఇజ్రాయెల్‌ ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ భద్రతా అధికారులు క్షమాపణలు సైతం చెప్పారు. ఈక్రమంలో ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ ‘యూనిట్‌ 8200’ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న యాస్సి సారిల్‌ రాజీనామా చేశారు. ఈమేరకు ఇజ్రాయెల్‌ భద్రతా అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు.

అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేసిన దాడులను నిలువరించడంలో విఫలమైంది. దీనికి బాధ్యత వహిస్తూ తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు సారిల్‌ వెల్లడించారు. ఇక, అక్టోబరు 7నాటి వైఫల్యానికి బాధ్యతగా ఇజ్రాయెల్‌ మిలటరీ నిఘా విభాగం అధిపతి మేజర్‌ జనరల్‌ అహరోన్‌ హలీవా ఏప్రిల్‌లో రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande