ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఏర్పాట్లు పూర్తి.. రేపు మధ్యాహ్నం కల్లా నిమజ్జనం
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.) దశ రాత్రుల పాటు నిర్విరామంగా పూజలందుకున్న ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతి నిమజ్జన క్రతువునకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం వరకు మహా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఖైరతా
మహాగణపతి నిమజ్జనం


హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)

దశ రాత్రుల పాటు నిర్విరామంగా

పూజలందుకున్న ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతి నిమజ్జన క్రతువునకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం వరకు మహా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఖైరతాబాద్ గణనాథుడి పనులు స్టార్ట్ అయ్యాయి. ఇక మహా గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్లే భారీ ట్రక్కు ఇప్పటికే విగ్రహం వద్దకు చేరుకుంది. దీంతో భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించడం లేదు. మరోవైపు షెడ్ వెల్డింగ్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. రాత్రి 9 గంటలకు మహా గణపతికి కలశ పూజ నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం సరిగ్గా 7 గంటల ప్రాంతంలో శోభాయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు క్రేన్ నెం.4 వద్ద ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతి నిమజ్జనం ముగియనుంది. ఇక హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తం 31 క్రేన్లుతో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande