రివర్స్ టెండర్ విధానం రద్దు చేస్తూ ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.) అమరావతి : వైకాపా ప్రభుత్వ పాలనలో అమల్లోకి తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన రివర్స్ టెండర్ జీవో నంబరు 67ను రద్దు చేస్తున్నట్లుగా పేర్కొంటూ ఉత్త
రివర్స్ టెండర్ విధానం రద్దు చేస్తూ ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ


అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.)

అమరావతి : వైకాపా ప్రభుత్వ పాలనలో అమల్లోకి తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన రివర్స్ టెండర్ జీవో నంబరు 67ను రద్దు చేస్తున్నట్లుగా పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది. 2019లో జగన్ ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్‌ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రివర్స్ టెండరింగ్ స్థానంలో పాత సంప్రదాయ టెండరింగ్ విధానం అమల్లోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ పనులకు ఇక నుంచి పాత టెండర్ విధానాన్ని అనుసరించాలని జీవోలో స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande