రాజీవ్ గాంధీ విగ్రహం కూలగొడతామంటే చూస్తూ ఊరుకోము..,
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పనులను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ విగ్రహాన
రాజీవ్ గాంధీ విగ్రహం కూలగొడతామంటే చూస్తూ ఊరుకోము..,


హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పనులను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆవిష్కరిస్తామన్నారు. యువతకు రాజీవ్ గాంధీ విగ్రహం ఆదర్శం.. రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అదృష్టం.. రాజీవ్ చిరస్మరణీయుడు అని ఆయన అన్నారు. విగ్రహంపై అనవసర రాజకీయాలు చేయొద్దు అని సూచించారు. రాజీవ్ పై మాట్లాడే వారికి ఆయనేంటో పుస్తకం పంపిస్తా.. రాజీవ్ విగ్రహం కూలగొడతం అంటే చూస్తూ ఊరుకోము.. ఒ్కసారి విగ్రహం టచ్ చేసి చూడండి అని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande