గోంగ్రిగాబు క్యూ నది ఒడ్డున ఈ హెలిపోర్ట్ నిర్మిస్తున్న డ్రాగన్ కంట్రీ..
ఇటానగర్ , 18 సెప్టెంబర్ (హి.స.)అరుణాచల్ ప్రదేశ్‌లోని సున్నితమైన ‘ఫిష్‌టెయిల్స్’ ప్రాంతానికి సమీపంలో వాస్తవ నియంత్రణ రేఖకు తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో కొత్త హెలిపోర్ట్ ను డ్రాగన్ కంట్రీ నిర్మిస్తుంది. మారుమూల ప్రాంతంలోకి సైనికు వేగంగా తరలించే సామర్థ్
గోంగ్రిగాబు క్యూ నది ఒడ్డున ఈ హెలిపోర్ట్ నిర్మిస్తున్న డ్రాగన్ కంట్రీ..


ఇటానగర్ , 18 సెప్టెంబర్ (హి.స.)అరుణాచల్ ప్రదేశ్‌లోని సున్నితమైన ‘ఫిష్‌టెయిల్స్’ ప్రాంతానికి సమీపంలో వాస్తవ నియంత్రణ రేఖకు తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో కొత్త హెలిపోర్ట్ ను డ్రాగన్ కంట్రీ నిర్మిస్తుంది. మారుమూల ప్రాంతంలోకి సైనికు వేగంగా తరలించే సామర్థ్యాన్ని చైనా సాయుధ దళాలు రెడీ చేసుకుంటున్నాయి. టిబెట్ అటానమస్ రీజియన్‌లోని న్యింగ్‌చి ప్రిఫెక్చర్‌లోని గోంగ్రిగాబు క్యూ నది ఒడ్డున ఈ హెలిపోర్ట్ నిర్మిస్తున్నట్లు పలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీని వల్ల భారతదేశానికి పెద్ద ముప్పుగా భావించొచ్చు అన్నమాట.

ఇక, ఈఓఎస్ డేటా అనలిటిక్స్‌లో అందుబాటులో ఉన్న ఓపెన్-సోర్స్ శాటిలైట్ ఇమేజరీ 2023 డిసెంబర్ 1వ తేదీ వరకు హెలిపోర్ట్ నిర్మిస్తున్న ప్రదేశంలో ఎలాంటి నిర్మాణం జరగలేనట్లు ఉంది. కానీ, డిసెంబర్ 31 నాటి తదుపరి ఉపగ్రహ చిత్రం, నిర్మాణం కోసం భూమిని క్లియర్ చేయడం కనబడుతుంది. 2024 సెప్టెంబరు 16వ తేదీన చిత్రీకరించబడిన తాజా మ్కాక్సర్ -మూలంలోని అధిక- రిజల్యూషన్ చిత్రాలు అధునాతనమైన హెలిపోర్ట్ నిర్మాణాన్ని సూచిస్తున్నాయి

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande