ఎన్నికల్లో పార్టీల ఉచిత హామీలపై విచారణ : సుప్రీం రోజైనా విచారణ జరపాలని పిటిషనర్‌ కోరారు.
దిల్లీ 19 సెప్టెంబర్ (హి.స.): సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో పోటాపోటీగా ఇస్తోన్న ఉచిత హామీల అంశంపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఇది ఎంతో ముఖ్యమైన అంశమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద
SC


దిల్లీ 19 సెప్టెంబర్ (హి.స.): సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో పోటాపోటీగా ఇస్తోన్న ఉచిత హామీల అంశంపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఇది ఎంతో ముఖ్యమైన అంశమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర ధర్మాసనం అభిప్రాయపడింది. ఉచిత హామీలను కట్టడి చేయాలంటూ తాము దాఖలు చేసిన వ్యాజ్యం బుధవారం నాటి విచారణ జాబితాలో ఉందని, దానిపై వాదనలను కొనసాగించాలని పిటిషనర్, న్యాయవాది అయిన అశ్వినీ ఉపాధ్యాయ్‌ ప్రస్తావించగా ధర్మాసనం ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande