జమ్మూ కాశ్మీర్ రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నాం.. ప్రధాని మోదీ
శ్రీనగర్, 19 సెప్టెంబర్ (హి.స.) జమ్ముకశ్మీర్ రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నామని ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ శ్రీనగర్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కశ్మీర్ ప్రాంతంలోని హిందువులు, సిక్కులపై దాడులు జరిగ
ప్రధాని మోదీ వ్యాఖ్యలు


శ్రీనగర్, 19 సెప్టెంబర్ (హి.స.)

జమ్ముకశ్మీర్ రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నామని ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ శ్రీనగర్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కశ్మీర్ ప్రాంతంలోని హిందువులు, సిక్కులపై దాడులు జరిగాయని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జమ్ముకశ్మీర్కు అనేక పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ జమ్ముకశ్మీర్ లోనే నిర్వహిస్తున్నామని తెలిపేందుకు సంతోషిస్తున్నానని అన్నారు.

గత పదేళ్ల కాలంలో కశ్మీర్ ప్రాంతంలో బంద్ వాతావరణం లేదని, శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని స్పష్టం చేశారు. ఇప్పుడు ఎవరి పనులు వాళ్లు చేసుకుటున్నారని అన్నారు. అది కేవలం జమ్ముకశ్మీర్ ప్రజల వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. గత పాలకుల హయాంలో బాలికల పాఠశాలలు తెరవలేదని గుర్తు చేశారు. అదేవిధంగా ప్రజలకు మానసికోల్లాసాన్ని కలిగించే సినిమా థియేటర్లు కూడా మూతపడ్డాయని ఎద్దేవా చేశారు. నేడు దాల్ లేక్లో పర్యాటకులు కూడా సందడి చేస్తున్నారని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. తాము అధికారంలో వచ్చిన తరువాత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. ముఖ్యంగా రైతుల ఖాతాల్లో ప్రతి ఏటా రూ.10 వేలు జమ చేస్తున్నామని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande