జమిలి ఎన్నికలపై నివేదిక సమర్పించిన కోవింద్‌ కమిటీ 7 దేశాల్లో అధ్యయనం
దిల్లీ, 19 సెప్టెంబర్ (హి.స.): జమిలి ఎన్నికలపై నివేదిక సమర్పించిన కోవింద్‌ కమిటీ 7 దేశాల్లో అధ్యయనం చేసింది. అందులో దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌ ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో జాతీయ అసెంబ్లీకి, ప్రొవిన్షియల్‌
జమిలి ఎన్నికల


దిల్లీ, 19 సెప్టెంబర్ (హి.స.): జమిలి ఎన్నికలపై నివేదిక సమర్పించిన కోవింద్‌ కమిటీ 7 దేశాల్లో అధ్యయనం చేసింది. అందులో దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌ ఉన్నాయి.

దక్షిణాఫ్రికాలో జాతీయ అసెంబ్లీకి, ప్రొవిన్షియల్‌ లేజిస్లేచర్లకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ తరువాత స్థానిక సంస్థలకు ఐదేళ్ల కాలానికి ఎన్నికలు నిర్వహిస్తారు.

స్వీడన్‌లో నైష్పత్తిక ప్రాతిపదికన ఎన్నికలను నిర్వహిస్తారు. పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఇక్కడ పార్లమెంటు, కౌంటీ కౌన్సిళ్లు, మున్సిపల్‌ కౌన్సిళ్లకు ఒకేసారి ఎన్నికలను నిర్వహిస్తారు. నాలుగేళ్లకోసారి సెప్టెంబరు రెండో ఆదివారం నాడు ఇవి జరుగుతాయి. మున్సిపల్‌ ఎన్నికలు మాత్రం ఐదేళ్లకోసారి జరుగుతాయి.

జర్మనీలో ఛాన్సలర్‌ నియామకంతోపాటు అదనంగా అవిశ్వాస తీర్మానం సమయంలో వినియోగించుకునే నిర్మాణాత్మక ఓటు ఉంటుంది.

జపాన్‌లో తొలుత ప్రధాని అభ్యర్థిని నేషనల్‌ డైట్‌ నిర్ణయిస్తుంది. దానిని రాజు ఆమోదిస్తారు.

2019 నుంచి ఇండోనేసియా జమిలి ఎన్నికలను నిర్వహిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande