మెట్రో రెండో దశ ప్రాజెక్ట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు.
అహ్మదాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)-గాంధీనగర్ మెట్రో రెండో దశ ప్రాజెక్ట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఫేజ్ 2లో మొత్తం 21 కిలోమీటర్ల మేరకు పొడిగించారు. ఎనిమిది కొత్త మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌
మెట్రో రెండో దశ ప్రాజెక్ట్‌


అహ్మదాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)-గాంధీనగర్ మెట్రో రెండో దశ ప్రాజెక్ట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఫేజ్ 2లో మొత్తం 21 కిలోమీటర్ల మేరకు పొడిగించారు. ఎనిమిది కొత్త మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును మోడీ ప్రారంభించారు. అనంతరం సెక్షన్ 1 మెట్రో స్టేషన్ నుంచి గిఫ్ట్ సిటీ మెట్రో స్టేషన్ వరకు ప్రధాని మోడీ మెట్రో రైడ్ చేశారు. ఈ సందర్భంగా రైల్లో విద్యార్థులతో ముచ్చటించారు. జూన్ 9న 3.0 ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande