దేశ ప్రజలు తమపై ఎంతో విశ్వాసం ఉంచారని, దానికి తగ్గట్టే మూడోసారి అధికారాన్ని కట్టబెట్టారు - మోదీ
గాంధీనగర్: , 16 సెప్టెంబర్ (హి.స.)ప్రజలు ఎంతో నమ్మకంతో తమకు మూడోసారి అధికారాన్ని కట్టబెట్టారని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ను మూడోస్థానంలో నిలబెట్టే సంకల్పంతో 140 కోట్ల మంది భారతీయులు పని చేస్తున్నారని
modiji


గాంధీనగర్: , 16 సెప్టెంబర్ (హి.స.)ప్రజలు ఎంతో నమ్మకంతో తమకు మూడోసారి అధికారాన్ని కట్టబెట్టారని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ను మూడోస్థానంలో నిలబెట్టే సంకల్పంతో 140 కోట్ల మంది భారతీయులు పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గుజరాత్‌(Gujarat)లోని గాంధీనగర్‌లో గ్లోబల్ రెన్యువబుల్ ఇన్వెస్టర్స్ సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు.

‘‘దేశ మిషన్-విజన్‌లో ఈ కార్యక్రమం ఒక భాగం. 2047కు భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేయాలనే మా కార్యాచరణలో ఇదీ ఒకటి. మా ప్రభుత్వం ఏర్పడిన ఈ వంద రోజుల్లో తీసుకున్న నిర్ణయాల్లో మా ప్రణాళికకు సంబంధించిన ట్రైలర్ కనిపిస్తుంది. దేశ ప్రగతికి సంబంధించి ప్రతీ రంగానికి చెందిన అంశాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించాం’’ అని మోదీ తెలిపారు.

‘‘దేశంలో మొట్టమొదటి సోలార్ పవర్ పాలసీని రూపొందించిన రాష్ట్రం గుజరాత్. తర్వాత దీనిని జాతీయస్థాయిలో తీసుకెళ్లాం. కొన్ని రాష్ట్రాల్లో సోలార్‌ పవర్ గురించి చర్చలు కూడా జరగని సమయంలో ఈ రాష్ట్రం సోలార్‌ ప్లాంట్లను ప్రారంభించింది. అయోధ్య రాముడి జన్మస్థానం. ఆయనది సూర్యవంశం. అక్కడ భారీ ఆలయాన్ని నిర్మించాం. ఇప్పుడు ఆ నగరాన్ని మోడల్ సోలార్‌ సిటీ మార్చేలా అడుగులు పడుతున్నాయి. అలాగే మేం దేశవ్యాప్తంగా మరో 17 నగరాలను గుర్తించాం. అవి కూడా సోలార్ సిటీలుగా అభివృద్ధి చెందుతాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande