సినిమా, 28 సెప్టెంబర్ (హి.స.)
సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక అబుదాబిలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. అయితే ఈ ఈవెంట్లో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినీ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు స్టేజ్పై స్పెషల్ అట్రాక్షన్గా నిలవడంతో పాటు అవార్డులు అందుకుని అభిమానుల ఆనందానికి కారణమయ్యారు. మరీ ముఖ్యంగా ఈ వేడుకలో 'పొన్నియన్ సెల్వన్' సినిమా ఏకంగా ఏడు అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. అయితే 2024 ఐఫా అవార్డులు సొంతం చేసుకున్న విజేతల లిస్ట్ ఇక్కడ తెలుసుకుందాం.
*ఐఫా వుమెన్ ఆఫ్ ఇయర్- సమంత.
* ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా- మెగాస్టార్ చిరంజీవి..
*ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా- ప్రియదర్శన్
*ఐఫా గోల్డెన్ లెగసీ అవార్డు- బాలకృష్ణ..
*ఉత్తమ చిత్రం (తమిళం) -జైలర్..
*ఉత్తమ నటుడు (తమిళం)- విక్రమ్ (పొన్నియన్ సెల్వన్-2)..
*ఐఫా ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ (కన్నడ) రిషబ్ శెట్టి..
* ఉత్తమ నటుడు (తెలుగు) -నాని (దసరా)..
* ఉత్తమ నటి (తమిళం)- ఐశ్వర్య రాయ్ (పీఎస్-2)..
* ఉత్తమ దర్శకుడు (తమిళం)- మణిరత్నం (పీఎస్-2)..
*ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) -ఏఆర్ రెహమన్ (పీ ఏస్-2)..
*ఉత్తమ విలన్ (తమిళం)-ఎస్ జే సూర్య (మార్క్ ఆంటోనీ)..
*ఉత్తమ నేపథ్య గాయకుడు-చిన్నంజిరు (పీఎస్-2)..
*ఉత్తమ నేపథ్య గాయని- శక్తిశ్రీ గోపాలన్ (పీఎస్-2)..
*ఉత్తమ విలన్ (తెలుగు)- షైన్ టామ్ (దసరా)..
*ఉత్తమ విలన్ (కన్నడ)- జగపతి బాబు..
* ఉత్తమ సినిమాటోగ్రఫీ- మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి..
* ఉత్తమ లిరిక్స్- జైలర్ (హుకుం)..
*ఉత్తమ విలన్ (మలయాళం)- అర్జున్ రాధాకృష్ణన్..
ఉత్తమ నటి (కన్నడ)- రుక్మిణి (సప్త సాగర దాచే ఎల్లో- సైడ్ ఎ)..
*ఉత్తమ నటుడు (కన్నడ)- రక్షిత్ శెట్టి (సప్త సాగర దాచే ఎల్లో-సైడ్ ఎ)..
* బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (తెలుగు)- బ్రహ్మానందం (రంగమార్తాండ)..
*ఉత్తమ సహాయక నటుడు (తమిళం)- జయరామ్ (పిఎస్-2)..
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..