స్పోర్ట్స్, 29 సెప్టెంబర్ (హి.స.)
భారత్ - బంగ్లాదేశ్ రెండో టెస్టు
- మూడో రోజు ఆట కూడా రద్దైంది. రెండోరోజు మాదిరిగానే మూడో రోజు కూడా ఒక్క బంతి పడకుండానే ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇవాళ వర్షం లేకపోయినా.. మైదానం చిత్తడిగా ఉండటంతో ఆట నిర్వహణకు సాధ్యపడలేదు. మైదానాన్ని పలుమార్లు పరిశీలించిన అంపైర్లు చివరకు మధ్యాహ్నం 2గంటలకు మరోసారి పరిశీలించి ఆటను రద్దు చేశారు. ఈ మ్యాచ్ లో తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్లో 107/3 స్కోరుతో కొనసాగుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినట్లయితే ఈ సిరీస్ను టీమ్ ఇండియా 1-0తో కైవసం చేసుకుంటుంది. కానీ, ఈ మ్యాచ్ రద్దైనా, డ్రాగా ముగిసినా భారత్కు 2025 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..