మేడ్చల్ ఎంపీడీవో కార్యాల ఆవరణలో వ్యక్తి ఆత్మహత్య
మేడ్చల్, 6 సెప్టెంబర్ (హి.స.) ఓ వ్యక్తి మేడ్చల్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట్ జిల్లా చిట్టాపూర్ గ్రామానికి చెందిన సురేందర్ రెడ్డి (52) మేడ్చల్ పట
మేడ్చల్ ఎంపీడీవో కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యమేడ్చల్ ఎంపీడీవో కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్య


మేడ్చల్, 6 సెప్టెంబర్ (హి.స.)

ఓ వ్యక్తి మేడ్చల్ ఎంపీడీవో

కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట్ జిల్లా చిట్టాపూర్ గ్రామానికి చెందిన సురేందర్ రెడ్డి (52) మేడ్చల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో భార్య మంజుల, కొడుకు దినేష్తో నివాసం ఉంటున్నాడు. అయితే, సురేందర్ రెడ్డి స్థానికంగా రిలయన్స్లో పని చేస్తూ జీవనం కొనసాగించే వాడు. శుక్రవారం ఉదయం ఎంపీడీవో ఆఫీసు కార్యాలయ ఆవరణలో ఉన్న ఇనుప మెట్లకు సురేందర్ రెడ్డి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande