హుజురాబాద్ మండలం సిరిసపల్లిలో తీవ్ర విషాదం.. వినాయక మండపంలో విద్యుత్ శాక్ తో యువకుడు మృతి
హుజురాబాద్, 7 సెప్టెంబర్ (హి.స.) హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో వినాయక చవితి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఒక యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందగా ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. శనివారం పండుగ ఉత్సహంలో ఉన్న ఆ యువకుడు గణేష్ మండపంలో లైట
వినాయక మండపంలో విద్యుత్ షాక్ తో యువకుడు మృతి


హుజురాబాద్, 7 సెప్టెంబర్ (హి.స.)

హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో వినాయక చవితి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఒక యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందగా ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. శనివారం పండుగ ఉత్సహంలో ఉన్న ఆ యువకుడు గణేష్ మండపంలో లైట్ బిగిస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు

...సిర్సపల్లి గ్రామానికి చెందిన వంగ వెంకటేష్ - లావణ్యలకు యశ్వంత్ (17) ఏకైక కుమారుడు. ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ యువకుడు వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని వినాయక మండపంలో బల్బు బిగిస్తుండగా బల్బు పగిలి విద్యుద్ఘాతానికి గురయ్యాడు. పక్కనే ఉన్న తండ్రి గమనించి యశ్వంత్ ను వెంటనే హుజురాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే యశ్వంత్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

పండుగ రోజే ఈ సంఘటన జరగడంతో వెంకటేష్ లావణ్య కుటుంబంలో తీరని విషాదం నింపింది. తమ కండ్ల ముందే యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ తిరుమల్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande