విజయవాడ, 15 జనవరి (హి.స.):జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు గోశాల ప్రసాద్ ( మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలు జర్నలిస్టుగా, రాజకీయ విశ్లేషకునిగా ప్రసాద్ ఎంతో పేరు తెచ్చుకున్నారన్నారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనపై ధైర్యంగా గళమెత్తి అన్ని వర్గాల మన్ననలు పొందారని తెలిపారు. రాజకీయ పరిణామాలపై టీవీ చర్చల్లో లోతైన విశ్లేషణతో ప్రజాపక్షాన పనిచేశారని.. తనదైన ముద్ర వేశారని అన్నారు. నిత్యం తన విశ్లేషణలతో, రాతలతో సమాజ హితం కోసం పనిచేసిన ప్రసాద్ మృతి తీవ్ర విచారం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన ముఖ్యమంత్రి చంద్రబాబు... వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల