అర్హులైన ప్రజలందరికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పట్టిష్ట కార్యాచరణ అమలు చేయాలి.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.
తెలంగాణ పెద్దపల్లి, 15 జనవరి (హి.స.) అర్హులైన ప్రజలందరికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పట్టిష్ట కార్యాచరణ అమలు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం మంథనిలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్
పెద్దపల్లి జిల్లా కలెక్టర్


తెలంగాణ పెద్దపల్లి, 15 జనవరి (హి.స.) అర్హులైన ప్రజలందరికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పట్టిష్ట కార్యాచరణ అమలు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం మంథనిలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డుల జారీపై మంథని నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీహర్ష అదనపు కలెక్టర్ వేణుతో కలిసి పథకాల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి అధికారులకు సూచనలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande