చిత్తూరు జిల్లా:, 15 జనవరి (హి.స.)
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( తెలుగు ప్రజలందరికి కనుమ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘కమ్మని విందుల కనుమ పండుగ మీ కుటుంబంలో సంతోషం నింపాలి... వ్యవసాయదారుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకొన్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు బోధిస్తుంది... కాలం మరినా తరగని అనుబంధాల సంపద మనది... ఆ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కమారు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను...’’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల