మంచు.మనోజ్.కు పోలీసు నోటీసులు
విజయవాడ, 15 జనవరి (హి.స.) j: మంచు ఫ్యామిలీలో వివాదాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.. హైదరాబాద్‌లోని మోహన్‌బాబు ఇంటి దగ్గర జరిగిన ఘటన పెద్ద చర్చగా మారగా.. ఇప్పుడిప్పుడే ఆ వ్యవహారం కాస్త చల్లబటినట్టు కనిపిస్తోన్న సమయంలో.. మంచు మనోజ్‌ పర్యటన మరోసా
మంచు.మనోజ్.కు పోలీసు నోటీసులు


విజయవాడ, 15 జనవరి (హి.స.)

j: మంచు ఫ్యామిలీలో వివాదాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.. హైదరాబాద్‌లోని మోహన్‌బాబు ఇంటి దగ్గర జరిగిన ఘటన పెద్ద చర్చగా మారగా.. ఇప్పుడిప్పుడే ఆ వ్యవహారం కాస్త చల్లబటినట్టు కనిపిస్తోన్న సమయంలో.. మంచు మనోజ్‌ పర్యటన మరోసారి కాకరేపుతోంది.. అయితే, మంచు మనోజ్‌కు తాజాగా నోటీసులు జారీ చేశారు పోలీసులు.. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్‌ వస్తారన్న సమచారంతో అప్రమత్తమైన పోలీసులు.. శాంతి భద్రతల దృష్ట్యా.. మోహన్‌బాబు యూనివర్సిటీలోకి అనుమతి లేదంటూ మనోజ్‌ నోటీసులు ఇచ్చారు.. మరోవైపు.. మంచు మనోజ్‌.. ఎంబీయూకి వస్తారన్న సమాచారంతో పోలీసులను మోహన్‌బాబు ఆశ్రయించారు.. మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు మనోజ్ రాకూడదంటూ కోర్టు ఉత్తర్వులు ఉన్నాయనే విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ప్రస్తుతం యూనివర్సిటీ క్యాంపస్ లోనే మోహన్ బాబు ఉన్నారు.. అయితే, మోహన్ బాబు సమాచారం మేరకు యూనివర్సిటీ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.. వర్సిటీలో బౌన్సర్లను కూడా

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande