మ‌హాకుంభ‌మేళాలో కొన‌సాగుతున్న భ‌క్త జ‌న సునామీ… మూడు రోజులలో 7.50 కోట్ల మంది పుణ్య స్నానం..
తెలంగాణ/ఏ.పీ, 15 జనవరి (హి.స.) మహా కుంభమేళాలో నేడు తెల్లవారుజామున 3 గంటల నుంచే వివిధ అఖాడాల నుంచి సాధువులు వేలాదిగా తరలివచ్చారు. వారితో పాటు సామాన్య భ‌క్త జ‌నం ల‌క్ష‌ల‌లో త‌ర‌లివ‌చ్చి త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు. తొలి రోజున 1.75 కోట్ల మం
కుంభమేళ


తెలంగాణ/ఏ.పీ, 15 జనవరి (హి.స.)

మహా కుంభమేళాలో నేడు తెల్లవారుజామున 3 గంటల నుంచే వివిధ అఖాడాల నుంచి సాధువులు వేలాదిగా తరలివచ్చారు. వారితో పాటు సామాన్య భ‌క్త జ‌నం ల‌క్ష‌ల‌లో త‌ర‌లివ‌చ్చి త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు. తొలి రోజున 1.75 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేయగా సంక్రాంతి ఒక్కరోజునే మొత్తం 3.5 కోట్ల మంది భక్తులు అమృత స్నానాలు చేశారు. మూడో రోజైన నేడు ఇప్ప‌టి వ‌ర‌కు 2 కోట్ల మందికి పైగా ప్రయాగ్‌రాజ్‌లో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ మూడు రోజుల‌లో మొత్తం 7.50 కోట్ల మంది ప‌విత్ర స్నానాలు అచ‌రించిన‌ట్లు తెలిపారు.144 ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే అరుదైన కుంభమేళా కావడంతో దేశవిదేశాల నుంచి భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు భారీగా తరలివస్తున్నారు. 45 రోజుల పాటు జరగనున్న మహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది.

వణికించే చలిని, దట్టమైన పొగమంచునీ లెక్కచేయకుండా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు మూడోరోజున పెద్ద ఎత్తున హాజరయ్యారు భక్తులు. ముందుగా శంభు పంచాయతీ అటల్‌ అఖాడా, పంచాయతీ అఖాడా మహానిర్వాణీకి చెందిన సాధువులు అమృత స్నానాలు ఆచరించారు. తర్వాత వివిధ అఖాడాల నుంచి ఊరేగింపుగా తరలివచ్చిన సాధువులు, నాగసాధువులు, అఘోరాలు పవిత్ర స్నానాలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande