తెలంగాణ, మెదక్. 15 జనవరి (హి.స.)
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికీ అమలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశానికి వర్చువల్ గా హాజరైన హరీష్ రావు మాట్లాడుతూ.. గుంట భూమి ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించకపోవడం శోచనీయమని, రాష్ట్రంలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 24,5700 మంది ఉన్నారని తెలిపారు. ఈ పథకంలో కోతలు లేకుండా రైతు కూలీలందరికీ 12 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు.
గుంట భూమి ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించకపోవడం అన్యాయమన్నారు. ఎకరంలోపు భూమి ఉన్న రైతులు తెలంగాణలో 24.57 లక్షల మంది ఉన్నారని.. కోతలు లేకుండానే రైతు కూలీలందరికీ 12వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. BRS హయాంలో మంజూరై పూర్తి కాని ఇళ్లకు నిధులు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో బుధవారం మాట్లాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్