తెలంగాణ, పెద్దపల్లి 15 జనవరి (హి.స.)
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. బుధవారం సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఎన్ఆర్ ఈజీఎస్ నిధులు రూ. 10 లక్షలతో తలపెట్టిన సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దశలవారీగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్